Chandrababu New Convoy: అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా వచ్చి అద్భుత విజయం సాధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈనెల 12వ తేదీన గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో భారీ భద్రతతో కూడిన వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు సంబంధించి కీలక పరిణామం జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడి


ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి. మొత్తం 11 వాహనాలతో చంద్రబాబు కాన్వాయ్‌ ఉండనుంది. నలుపు రంగులో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్‌ బృందం పరిశీలిస్తోంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నంబర్ ప్లేట్లు వేశారు. వీటిలో 2 వాహనాలను సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు.

Also Read: Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?


 


రెండున్నర దశాబ్దాల కిందట తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే చంద్రబాబుపై బాంబు దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంద్రబాబు భద్రతా భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఏ రూపంలో ఉన్నా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఉంటుంది. జగన్‌ ప్రభుత్వం కొంత బాబు భద్రతను తగ్గించింది. కానీ తాజా ఎన్నికల సమయంలో బాబు భద్రతను కేంద్రం పెంచింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన భద్రత భారీ స్థాయిలో ఉండనుంది. 


కాగా ముఖ్యమంత్రి భద్రతా విషయాలు గోప్యంగా ఉంచుతారు. అందుకే సీఎం కాన్వాయ్‌, భద్రతా సిబ్బంది ఎంత అనేది ఇక్కడ ప్రస్తావించడం లేదు. కాకపోతే సీఎం కాన్వాయ్‌లో చాలా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎక్కడికి ప్రయాణించినా భద్రతా భారీగా ఉంటుంది. ఆ కాన్వాయ్‌లో డాగ్‌ స్వ్కాడ్‌, బాంబు స్క్వాడ్‌, జామర్‌ బృందంతోపాటు సీనియర్‌ పోలీస్‌ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తుంటారు. ఇక సీఎం కాన్వాయ్‌లో ఎల్లప్పుడూ ఒక అంబులెన్స్‌ ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఉంటుందో తెలియకపోవడంతో నిరంతరం అంబులెన్స్‌ కాన్వాయ్‌లో భాగం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook